గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (10:53 IST)

బాహుబలి-2 ట్రైలర్ కొత్త రికార్డు.. 150 మిలియన్ వ్యూస్ దాటేసింది.. చైనాలో రిలీజ్

ప్రభాస్, రానా ప్రధాన పాత్రధారులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందు యూట్యూబ్‌లో ఉంచిన ట్రైలర్ మొదటి రోజు నుంచే అత్

ప్రభాస్, రానా ప్రధాన పాత్రధారులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందు యూట్యూబ్‌లో ఉంచిన ట్రైలర్ మొదటి రోజు నుంచే అత్యధిక వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతోంది. 
 
ఈ ట్రైలర్ ప్రస్తుతం 150 మిలియన్ల వ్యూసే దాటేసిందని బాహుబలి-2 టీమ్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. భారతీయ సినీ చరిత్రలోని ఎన్నో రికార్డులను బద్దలుకొట్టిన బాహుబలి-2 చైనాలో విడుదల కానుంది. చైనాలోని 4 వేల థియేట‌ర్ల‌లో బాహుబలి 2 రిలీజ్ కానుంది. 
 
ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో సినిమా రిలీజ్ కానుంది. బాహుబ‌లి స్టార్సంతా ప్ర‌మోష‌న్ కోసం చైనా వెళ్ల‌నున్న‌ట్లు సమాచారం. చైనాలో దంగ‌ల్‌ను ప్రమోట్ చేసిన డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీనే బాహుబ‌లి 2 మేక‌ర్స్ సంప్ర‌దించారు. దంగ‌ల్ ఇండియాలో కంటే చైనాలోనే ఎక్కువ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన సంగతి తెలిసిందే. 
 
ఇప్పుడ‌దే కంపెనీ ప్ర‌మోట్ చేస్తే.. బాహుబ‌లి 2 చైనాలోనూ రికార్డులు కొల్ల‌గొట్ట‌డం ఖాయమని సినీ యూనిట్ భావిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా ఇప్ప‌టికే రూ.1500 కోట్ల‌కుపైగా వ‌సూలు చేసిన నేప‌థ్యంలో.. చైనాలోనూ అదే రేంజ్‌లో వ‌స్తే మాత్రం దంగ‌ల్‌ను వెన‌క్కి నెట్టడం ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.