మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జులై 2020 (11:24 IST)

ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన మరాఠీ నటుడు

Ashutosh Bhakre
బాలీవుడ్‌లో యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో నటుడు ప్రాణాలు కోల్పోయాడు. మరాఠీ నటుడు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తన నివాసంలో నటుడు అశుతోష్ భక్రే (32) ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి అతడు గురౌతున్నాడని బంధువులు చెబుతున్నారు. 
 
దీనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. నాందెడ్‌లోని గణేష్ నగర్ ప్రాంతంలో ఉంటున్న అశుతోష్ భక్రే తీవ్ర మానసిక ఆందోళనకు గురౌతున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఉరివేసుకున్నాడు. 
 
కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అతడు విగత జీవిగా కనిపించాడు. కాగా అతడు 'భకార్, ఇచర్ థార్లా' లాంటి మరాఠీ సినిమాల్లో నటించాడు. ఆయన భార్య మయూరి దేశ్ ముఖ్ కూడా 'ఖుల్తా కాళీ ఖులేనా' అనే సీరియల్‌లో నటిగా ఉన్నారు.