శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (20:30 IST)

రిలేషన్‌షిప్‌పై క్లారిటీ ... నిక్కీ గల్రానీతో కెమెరా కంటికి చిక్కిన ఆది పినిశెట్టి...(Video)

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు, సౌత్ యాక్టర్, 'రంగస్థలం' ఫేం.. ఆది పినిశెట్టి.. హీరోయిన్ నిక్కీ గల్రానీతో రిలేషన్‌లో ఉన్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. కానీ, దీనిపై హీరోహీరోయిన్లు ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. 
 
ఈ క్రమంలో నిక్కీ గల్రానీతో కలిసి ఆది పినిశెట్టి హైదరాబాద్‌, శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్టు తేలిపోయింది. నిజానికి నిక్కీ గల్రానీ కరోనా వైరస్ బారినపడ్డారు. ఆ తర్వాత ఆమె 15 రోజులు పాటు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొంది కోలుకున్నారు. 
 
అంతేకాకుండా, ఇటీవల హీరో ఆది తండ్రి అయిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి పుట్టిన రోజు వేడుకల్లో కూడా నిక్కీ గల్రానీ సందడి చేసింది. సో... తమ రిలేషన్‌షిప్‌‌పై వీరిద్దరూ క్లారిటీ ఇవ్వకపోయినా వారిద్దరూ అలా కలిసివున్నారనే విషయం తాజాగా తేటతెల్లమైపోయింది.