గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 మే 2017 (09:49 IST)

తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీకి టైమ్ రాలేదు : కమల్ హాసన్

తమిళనాడులో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి విశ్వనటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ పాగా వేసేందుకు అపుడే సమయం రాలేదన్నారు.

తమిళనాడులో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి విశ్వనటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ పాగా వేసేందుకు అపుడే సమయం రాలేదన్నారు. 
 
ఆయన తాజాగా ఓ అంగ్ల పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ... తమిళనాడులో వేళ్లూనుకునే సమయం బీజేపీకి ఇంకా రాలేదన్నారు. తనకు సంబంధించినంత వరకు జాతీయ జెండా కనిపిస్తే తలవంచి నమస్కరిస్తానని చెప్పారు. తమిళనాడులో బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 
 
బీజేపీకి తమిళనాడు అనుకూలిస్తుందా? లేదా? అన్న విషయం తనకు తెలియదని, అయితే బీజేపీకి తమిళనాడులో ఇంకా టైం రాలేదని వ్యాఖ్యానించారు. జాతీయ నాయకుడు ఒకరు తమిళ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు జరుగుతున్న ప్రచారంపై అడిగిన ప్రశ్నకు.. ఈ దేశంలో తమిళనాడు ఒక భాగం కాబట్టి రాష్ట్రాభివృద్ధిలో ఎవరైనా భాగం పంచుకోవచ్చని కమల్ హాసన్ స్పష్టం చేశారు.