'కోర్టు'తో కొత్త జీవితం మొదలైంది : నటుడు శివాజీ
"కోర్టు" చిత్రంలో తన కొత్త జీవితం మొదలైందని నటుడు శివాజీ చెప్పారు. 'మంగపతి' పాత్రలో నటించడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఇలాంటి పాత్రల కోసమే తాను ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. కేవలం డబ్బు కోసమే తాను సినిమాలు చేయడం లేదన్నారు. నటుడుగా సంతృప్తినిచ్చే పాత్రల కోసమే తాను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.
'90లో వెబ్ సిరీస్ తర్వాత నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. చాలావరకూ తండ్రి పాత్రలే. దాంతో వాటిని రిజెక్ట్ చేశా. కేరీర్ పరంగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించాలని ఉంది. ఈ క్రమంలోనే 'కోర్టు' అవకాశం వచ్చిందన్నారు. ఇలాంటి పాత్రల కోసమే దాదాపు 25 ఏళ్ళ నుంచి ఎదురుచూస్తుండగా, ఈ సినిమా చూసిన తర్వాతైన దర్శకులు నా వద్దకు విభిన్నమైన పాత్రలతో వస్తారని ఆశిస్తున్నా' అని తెలిపారు.
"ఇటీవల నా వద్దకు ఒక స్క్రిప్టు వచ్చింది. కథ చాలా విభిన్నంగా అనిపించింది. దర్శకుడు కథ చెప్పగానే నా పాత్రకు సంబంధించిన రెండు కీలకమైన విషయాలు చెప్పా. వాటివల్ల సినిమాలపై ప్రభావం ఉంటుందని కూడా తెలియజేశా. అయితే, అది హీరోకు నచ్చకపోయి ఉండొచ్చు. అందుకే వాళ్లు మళ్లీ నన్ను సంప్రదించలేదు. ఆ సినిమా ఇంకా మొదలైనట్టు లేదు" అని పేర్కొన్నారు.