శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జనవరి 2025 (14:24 IST)

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)

chinta mohan
వైకుంఠ దర్శన టిక్కెట్ల కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. అయితే, కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ మాత్రం మరోలా స్పందించారు. తిరుమలలో తొక్కిసలాట జరగలేదన్నారు. భక్తులు వాళ్లంతట వారే పడిపోయారని చెప్పారు. ఇందులో తితిదే అధికారుల వైఫల్యమేమీ లేదన్నారు. తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. గంటల తరబడి ప్రయాణం చేసి ఏమి తినకుండా ఆకలితో భక్తులు లైనులో నిలబడ్డారనీ, దీంతో అనేక మందికి బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి కిందపడిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
తిరుపతిలో తోపులాట - ఆరుగురు మృతి : సెక్యూరిటీ లోపం వల్లే... 
 
తిరుమలలో ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పిస్తున్నారు. ఈ దర్శనాల కోసం తిరుపతి, తిరుమలలో రేపటి నుంచి టోకెన్ల జారీకి తితిదే ఏర్పాట్లు చేసింది. అయితే, భక్తులు ముందుగానే టోకెన్ జారీ కేంద్రాల వద్దకు భారీగా తరలివచ్చారు. 
 
ఈ క్రమంలో తిరుపతిలో శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం వద్ద ఉన్న టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తుల మధ్య భారీగా తోపులాట చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు సొమ్ముసిల్లి పడిపోవడంతో వారిని తిరుపతిలోనే రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్టు గుర్తించారు. 
 
ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఘటన స్థలాలకు చేరుకుని పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. వైకుంఠ ద ్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్దకు అదనపు పోలీస్ బలగాలను తరలించారు.