1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : గురువారం, 26 జనవరి 2017 (15:24 IST)

అందరూ అదే అంటున్నారు.. ఫ్యాన్స్‌లేకపోతే నేను లేను : చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి సినీమా రంగంలోకి వచ్చేవారందరికీ స్ఫూర్తి‌. అలాంటివారిలో సునీల్‌ కూడా ఒకడు. ఆయనతో కలిసి పలు చిత్రాల్లో స్నేహితుడిగా నటించాడు కూడా. సునీల్‌ హీరో అయ్యాక.. 'ఖైదీ నెం.150'లో వచ్చిన అవకా

మెగాస్టార్‌ చిరంజీవి సినీమా రంగంలోకి వచ్చేవారందరికీ స్ఫూర్తి‌. అలాంటివారిలో సునీల్‌ కూడా ఒకడు. ఆయనతో కలిసి పలు చిత్రాల్లో స్నేహితుడిగా నటించాడు కూడా. సునీల్‌ హీరో అయ్యాక.. 'ఖైదీ నెం.150'లో వచ్చిన అవకాశం డేట్స్‌ కుదరక చేయలేకపోయాడు. ఇదిలా వుండగా... చిరంజీవి నటించిన 'ఖైదీ నెం.150' సినిమాను సునీల్‌ తిలకించారు. 
 
ఈ సందర్భంగా చిరంజీవిని కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా సునీల్‌ స్పందిస్తూ... అన్నయ్యా! ఖైదీనెం.150 సినిమా మాలాంటి ఫ్యాన్స్‌ ఇన్‌స్పిరేషన్‌గా వుంది. మీరు తెరపై కన్పించిన ప్రతి సన్నివేశాన్ని చూస్తూనే వున్నా. ఎక్కడ ఏమి మిస్‌ అవుతాననోనని ఒక్కక్షణం కూడా కల్లు మూయాలనిపించలేదు. ఇంత స్లిమ్‌గా వుండీ మాలాంటివారికి స్ఫూర్తిగా నిలిచారని'' తెలిపారు.
 
అందుకు చిరంజీవి బదులిస్తూ... ప్రతి ఒక్కరూ ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఏది ఏమైనా ఫ్యాన్స్‌లేకపోతే ఇంత ఆదరణ మరలా పొందేవాడ్ని కాదు. సినిమాను హిట్‌ చేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.