1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 మే 2017 (14:29 IST)

చలపాయ్ బాబాయ్‌ చాలా మంచోడు... క్షమించి వదిలేయండి : నటి హేమ వేడుకోలు

'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో కార్యక్రమంలో సినీ నటుడు చలపతిరావు చేసిన కామెంట్స్‌పై పలువురు సినీనటులు తమతమ స్పందనలు తెలియజేస్తున్నారు. వీరంతా చలపతిరావు ఆ వ్యాఖ్యలు చేసివుండాల్సింది కాదంటూ వ్యాఖ

'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో కార్యక్రమంలో సినీ నటుడు చలపతిరావు చేసిన కామెంట్స్‌పై పలువురు సినీనటులు తమతమ స్పందనలు తెలియజేస్తున్నారు. వీరంతా చలపతిరావు ఆ వ్యాఖ్యలు చేసివుండాల్సింది కాదంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటివారిలో నటి హేమ కూడా ఉంది. 
 
"నిజంగా చలపతి బాబాయ్ చేసింది తప్పని నేను మీ అందరితో ఏకీభవిస్తున్నాను. పోలీసులకు ఫిర్యాదు చేసి మంచిపని చేశారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటే భయపడతారు. అలాగే, చలపతి బాబాయ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఆయన ఎపుడూ ఎవరితోనూ గొడవపడిన దాఖలాలు లేవు. సరదాగా మాట్లాడతాడు, కానీ ఎప్పుడూ ఆడవాళ్లకేం హాని చేయలేదు. ఈ వివాదం తర్వాత ప్రతి టీవీ చానల్స్‌కు వెళ్లిమరీ ఆయన క్షమాపణ కోరారు. అది దృష్టిలో పెట్టుకుని అతనిపై దయచేసి కేసులన్నీ విత్ డ్రా చేసుకోవాలని కోరుతున్నా అని హేమ ప్రాధేయపడ్డారు.
 
అలాగే హీరో రామ్ కూడా స్పందించారు. మహిళలపై మీరు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మీ నుంచి మేము ఎలాంటి క్షమాపణలు కోరడం లేదని ట్వీట్ చేశాడు. ఇంత వయసు వచ్చినా మహిళల యొక్క నిజమైన విలువేంటో మీరు తెలుసుకోకపోవడం పట్ల చింతిస్తున్నాం. మహిళల పట్ల మా జనరేషన్‌కు మీలాంటి అభిప్రాయాలు కాకుండా... విభిన్నమైన అభిప్రాయం ఉందని.. మహిళను మేము చాలా గౌరవిస్తాం. అందుకు మేము ఎంతో గర్విస్తున్నామంటూ రామ్ చురకలంటించాడు.