శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 9 జులై 2019 (14:04 IST)

కాజల్ అగర్వాల్ కొత్త బిజినెస్... ఎగబడుతున్న హీరోలు...

ఇటీవలికాలంలో పలువురు టాలీవుడ్ హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా నడుచుకుంటున్నారు. అంటే.. కేరీర్ పీక్ స్టేజీలో ఉన్నపుడే నాలుగు పైసలు వెనకేసుకోవడం లేదా తాము సంపాదించిన డబ్బును ఏదేని వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. ఇపుడు కాజల్ అగర్వాల్ కూడా ఇదే పని చేస్తోంది. 
 
నిజానికి కాజల్ అగర్వాల్ "చందమామ" చిత్రం ద్వారా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఆమె గ్లామ‌ర్ విష‌యంలో నేటి త‌రం హీరోయిన్స్‌కు గ‌ట్టిపోటినిస్తూనే అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటుంది. ఇప్ప‌టికీ తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టిస్తుందీమె. అయితే ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ త‌మ సంపాద‌న‌ను సినిమా రంగంలోనే కాదు.. ఇత‌ర వ్యాపారాల్లోనూ పెట్టుబడిగా పెడుతున్నారు. 
 
ఇందులోభాగంగా, కాజల్ అగర్వాల్ ఓ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. తాను సంపాదించిన మొత్తాన్ని ఆమె బంగారు వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. అంటే ముంబైలో కాజ‌ల్ జ్యూయ‌ల‌రీ షాప్‌ను ప్రారంభించింది. దీంతో అనేక మంది హీరోలు ఆ షాపులో షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. పైగా, తమకు తెలిసిన వారిని కూడా అక్కడ కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు.