సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

తెలుగు హీరోయిన్‌గా లయ కుమార్తె ఎంట్రీ?

laya with daughter
తెలుగు చిత్రపరిశ్రమలో దశాబ్దకాలం పాటు హీరోయిన్‌గా రాణించిన నటి లయ. వివాహం తర్వాత ఆమె అమెరికాలో స్థిరపడిపోయారు. లయ నటించిన తొలి చిత్రం "స్వయంవరం". దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ, డైలాగ్స్ అందించిన చిత్రం. సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా నటించారు. 
 
ఇపుడు ఈమె కుమార్తె తెలుగు చిత్రపరిశ్రమలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె పేరు శ్లోక. హీరో రవితేజ నటించిన "అమర్ అమక్ర్ ఆంటోనీ" చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. శ్లోక కూడా లయ లాగా ఎంతో అందంగా ఉన్నారు. తన కుమార్తె హీరోయిన్‌గా ఓ సినిమాలోనైనా నటిస్తే చూడాలని ఉందని గతంలో లయ తన మనసులోని మాటను బహిర్గతం చేశారు. 
 
దీంతో శ్లోక కూడా ఇండస్ట్రీకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నారు. కాగా, లయ భర్త పేరు గణేష్ గోగుర్తి. అమెరికాలో ప్రముఖ వైద్యనిపుణులు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతుండగా, కుమారుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.