1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (17:20 IST)

కోలీవుడ్ నటి నల్లెనై చిత్ర కన్నుమూత

chitra
ప్రముఖ కోలీవుడ్ నటి నల్లెనై చిత్ర (56) శనివారం ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో చిత్ర కేరళలోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. బాల నటిగా సినీ పరిశ్రమలోకి చిత్ర అడుగు పెట్టారు. 
 
1980-90 మధ్య కాలంలో పలు కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో ఆమె నటించారు. వడక్కన్ వీరగాథ, పరంపర, కలిక్కలం, రాజవచ్చ తదితర మలయాళ  సినిమాలు చిత్రకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.  
 
ఇటీవల సినిమాలకు దూరమైన చిత్ర తమిళ సీరియల్స్‌తో బిజీ అయిపోయారు. ఆమెకు భర్త విజయ రాఘవన్, కుమార్తె మహాలక్ష్మి ఉన్నారు. చిత్ర మృతిపై పలువురు కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. శనివారం సాయంత్రం చిత్ర అంత్యక్రియలను ఆమె గ్రామంలో జరగనున్నాయి.