దిలీప్ గురించి మీడియా గొప్పగా చెప్పడం విడ్డూరం : రకుల్ - తాప్సీ - లక్ష్మీ
నటిని లైంగికంగా వేధించిన కేసులో నిందితుడుగా ఉన్న నటుడు దిలీప్ కుమార్‌కు చెన్నైకు చెందిన పాత్రికేయురాలు శుభాకాంక్షలు తెలుపడంపై సినీ నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ, మంచు లక్ష్మీలు మండిపడ్డారు. ఇదే అంశంపై వారు ట్వీట్ చేశారు.
మలయాళ నటుడు దిలీప్ కుమార్ ఓ నటిని లైంగికంగా వేధించాడని బాధిత మహిళ కేసు పెట్టడంతో ఆయనని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల బెయిల్‌పై బయటకి వచ్చాడు. అయితే దిలీప్, కావ్య దంపతులకి రీసెంట్‌గా ఆడపిల్ల జన్మించింది ఈ క్రమంలో 'లవ్లీ కపుల్ దిలీప్, కావ్యకు ఆడశిశువు జన్మించింది.. శుభాకాంక్షలు' అని మహిళా పాత్రికేయురాలు అని ట్వీట్ చేశారు.
దీనిపై మండిపడ్డ మంచు లక్ష్మీ నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న దిలీప్ కుమార్‌ని ట్యాగ్ చేయడం నమ్మలేకపోతున్నా. నటీమణులు అందరు ఆయనకి వ్యతిరేఖంగా పోరాడుతున్న సమయంలో నువ్వు ఆయనకి సపోర్ట్‌గా ఉండడం సిగ్గు పడాల్సిన విషయం అన్నారు.
ఇక తాప్సీ.. మహిళే మీటూ ఉద్యమానికి వ్యతిరేఖంగా ప్రవర్తిసుంటే చాలా ఇబ్బందికరంగా ఉందని అన్నారు. దిలీప్‌లాంటి వ్యక్తుల గురించి మీడియా గొప్పగా చెప్పడం విడ్డూరంగా ఉంది. మీ నుండి ఇలాంటి ట్వీట్ వచ్చిందంటే నమ్మాలనిపించడం లేదు. మార్పు మన నుండే వచ్చిందని గుర్తు పెట్టుకోండని రకుల్ ట్వీట్‌లో తెలిపింది.