ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (20:49 IST)

అక్క కుమార్తె పెళ్లి కోసం తిరుమలకు వచ్చిన సినీ రంభ

rambha
ఒకపుడు తెలుగు చిత్రపరిశ్రమను ఓ ఊపు ఊపిన సినీ హీరోయిన్ రంభ ఉన్నట్టుండి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. ఆమె అక్క కుమార్తె పెళ్లి కోసం తిరుమలకు వచ్చిన రంభ, తన భర్త, పిల్లలతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 
 
వివాహం చేసుకుని కెనడాలో స్థిరపడిపోయిన రంభ చాలా రోజుల తర్వాత ఇటీవల భారత్‌కు వచ్చారు. గత వారం రోజులుగా చెన్నైలో ఉన్న ఆమె ఇటీవల తన భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సహచర సినీ నటి మీనాను కలిసి ఓదార్చారు. 
 
మంగళవారం ఉన్నట్టుండి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. తన అక్క కుమార్తె పెళ్లి కోసం తిరుమలకు వచ్చిన ఆమె తన పిల్లలు, భర్తతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనానంతరం మీడియా కంటపడ్డారు. 
 
ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, దర్శనం చాలా బాగా జరిగింది. తన అక్క కూతురి వివాహం కోసం ఫ్యామిలీతో కలిసి ఇండియాకు వచ్చాను. ప్రస్తుతం ఇంతకుమించి ఏం మాట్లాడలేనని, చూడండి నాతో పాటు పిల్లలు కూడా ఉన్నారని వినయంగా సమాధానమిచ్చారు.