గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (14:35 IST)

యువ క్రికెటర్‌లో సోనాల్ డేటింగ్... ప్రతి విషయంలో ఎక్స్‌పర్ట్ అంటూ కామెంట్స్

భారత క్రికెట్ జట్టులో యువ క్రికెటర్ కేఎల్. రాహుల్. ఈయన బాలీవుడ్ నటి సోనాల్ చౌహన్‌తో డేటింగ్‌లో మునిగితేలుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఓ నెటిజన్ తనదైనశైలిలో స్పందించాడు. 'రూమ‌ర్స్ లేకుండా మీరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌లేక‌పోతున్నారా? రూమ‌ర్స్ లేక‌పోతే సినీ ప‌రిశ్ర‌మ‌లో మీకు మ‌నుగ‌డ కూడా ఉండ‌దు ' అంటూ పోస్ట్ చేశాడు. 
 
ఈ వ్యాఖ్యలపై సోనాల్ స్పందించింది. 'సోనాల్.. రూమ‌ర్స్ .. రూమ‌ర్స్‌.. రూమ‌ర్స్ .. ఎవ‌రు వీటిని పుట్టిస్తున్నారు' అని ఘాటుగా బ‌దులిచ్చింది. ఆ త‌ర్వాతి ట్వీట్‌లో మీరు ప్ర‌తి విష‌యంలో చాలా ఎక్స్‌ప‌ర్ట్‌లా క‌నిపిస్తున్నారు. విచారకరమైన జీవితంతో చాలా నిరాశ చెందారు. ప్రతి ఒక్కరి గురించి నెగెటివ్ కోణంలో ఆలోచించే మీ ప్రతికూల మనస్తత్వాన్ని మార్చడంపై మీరు దృష్టి పెట్టాలి. దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని సోనాల్ పేర్కొంది.
 
కాగా, సోనాలా చౌహాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హీరో బాలకృష్ణ నటించిన లెజెండ్, డిక్టేటర్ వంటి చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాల్లో తన అందాలను ఆరబోసింది. ప్ర‌స్తుతం కేఎస్ ర‌వికుమార్ - బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రంలో కథానాయిక‌గా న‌టిస్తోంది.