గ్రామీణ యువతిని మోసం చేసి అడ్డంగా బుక్కయిన యాంకర్

Ravi
జె| Last Modified సోమవారం, 17 ఆగస్టు 2020 (18:23 IST)
యాంకర్ రవి.. ఇతని గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. బుల్లితెరపై రవికి మంచి పేరే ఉంది. అందమైన అమ్మాయిల అందాల్ని తలదన్నే విధంగా యాంకర్ రవి యాంకరింగ్ ఉందన్న వారు లేకపోలేదు. యూత్‌లో రవికి మంచి ఫాలోయింగే ఉంది.

పటాస్ షోతో బాగా పాపులర్ అయ్యాడు రవి. అయితే కొన్నిరోజులకే ఆ షోని వదిలేసి అదిరింది అనే షోకు వచ్చాడు. అయితే ఈ షోతోనే అతను ఒక గ్రామీణ యువతిని మోసం చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం పోలీసులు రవిపై కేసు కూడా నమోదు చేశారట.

అదిరింది షోలో రౌడీ బాయ్స్ టీం స్కిట్‌లో యాక్టింగ్ చేసేటప్పుడు ఒక గ్రామీణ మహిళను లైన్లో పెట్టాడు రవి. ఆ తరువాత ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడట. అయితే తనను రవి మోసం చేశాడంటూ యూనిట్ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుందట ఆ మహిళ. అయితే ఆమెకు నచ్చచెప్పి మొదట్లో యూనిటమ్ సభ్యులు పంపించేశారట.

కానీ ఆమె మాత్రం వదిలిపెట్టలేదట పోలీస్టేషన్‌కు వెళ్ళి ప్రస్తుతం ఫిర్యాదు చేసిందట. ఇదంతా అదిరింది షోకి సంబంధించినది. మరీ ఈ షో ఏమేరకు పేలుతుందో చూడాలి.దీనిపై మరింత చదవండి :