గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 30 మార్చి 2024 (16:23 IST)

ఆదిత్య పాపగారి రియల్టర్ నుంచి సినిమా రంగంలోకి ప్రవేశం

Aditya Papagari
Aditya Papagari
రియల్ ఎస్టేట్ రంగంలో అంబరాన్ని తాకే విజయాలను అందుకున్నప్రముఖ రియల్టర్, మూన్ స్కేప్ రియాలిటీ వ్యవస్థాపకుడు సీఈఓ ఆదిత్య పాపగారి ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. 
 
సినిమా పరిశ్రమలో రాణించాలని, మంచి సినిమాలు అందించాలనే ఉద్దేశంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన ఎంచుకున్న ఏ రంగంలోనైనా సరే అనుకున్న విజయాలు సాధించడం ఆయనకు సర్వసాధారణం. అందుకే క్లిష్టమైన సినిమా రంగంలో ఇష్టంగా అడుగు పెడుతున్నారు.  ఈ నేపథ్యంలోనే షేక్ స్పియర్ డ్రీమ్స్ ఎల్ఎల్ పీ బ్యానర్ తో, ప్రముఖ దర్శకుడు, నిర్మాత స్వప్నేష్ చింతల తో కలిసి సంయుక్తంగా చిత్రాలు నిర్మించబోతున్నారు. 
 
మంచి సినిమాలతో పాటు కొత్తవాళ్లను, ఔత్సాహిక నటీనటులను, రచయితలను, దర్శకులను ప్రొత్సహించాలనేది ఆదిత్య పాపగారి మోటో అని తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తులే సినిమా రంగానికి కావలి. ఆదిత్య పాప స్థాపించే ప్రొడక్షన్ సంస్థ నుంచి మంచి సినిమాలు రావాలని, సినిమా పరిశ్రమలో మంచి విజయాలు అందుకోవాలని కోరుకుందాం. ఆయన ప్రొడక్షన్ సంస్థకు సంబంధించిన వివరాలు, బ్యానర్ తదితర అంశాలు త్వరలోనే తెలియజేయనున్నారు.