ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (14:09 IST)

బాహుబలి 2కి తర్వాత ప్రభాస్ సినిమా ఏంటో తెలుసా? నితీశ్ ముఖేశ్ కీలక పాత్రలో?

బాహబలి-2కి తర్వాత ప్రభాస్ తదుపరి సినిమాలో నటించేందుకు రెడీ అయిపోయాడు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న 'బాహుబలి 2' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్‌ వై సు

బాహబలి-2కి తర్వాత ప్రభాస్ తదుపరి సినిమాలో నటించేందుకు రెడీ అయిపోయాడు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న 'బాహుబలి 2' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్‌ వై సుజీత్‌ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించనున్నారు. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 
 
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ముఖేశ్‌ ఈ సినిమా గురించి మాట్లాడారు. తనకు ఈ ప్రాజెక్టుని ఖరారు చేయడానికి దాదాపు ఒక్క సంవత్సరం పట్టింది. ఈ చిత్రం కథ, అందులోని తన పాత్ర చాలా ఛాలెంజింగ్‌గా ఉండటం ఎగ్జైటింగ్‌గా ఉంది. దీంతో మరోసారి ప్రయోగం చేసే అవకాశం తనకు వచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్రభాస్‌తో కలిసి తెరపై కనిపించడం ఎంతో సంతోషంగా ఉందని ముఖేష్ చెప్పుకొచ్చాడు.