శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (16:19 IST)

పురట్చితలైవి జయలలిత పాత్రలో కాజోల్?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ నటించనున్నారు. ఇప్పటికే జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా మూడు బయోపిక్‌లు తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. వీటిలో రెండు బయోపిక్‌లలో నిత్యామీనన్, కంగనా రనౌత్‌లు బయలలిత పాత్రల్లో కనిపించనున్నారు. 
 
ఇదిలావుంటే, నాలుగో బయోపిక్‌ను ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తీయనున్నారు. జయలలిత అనారోగ్యం పాలైన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన తర్వాత జరిగిన పరిణామాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి శశిలలిత అనే పేరు పెట్టారు. 
 
అయితే, ఈ చిత్రంలో జయలలిత పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటి, అజయ్ దేవగణ్ సతీమణి కాజోల్‌ను సంప్రదించారట. కాజోల్ నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదని వచ్చిన వెంటనే సినిమాను ప్రకటిస్తారని సమాచారం. నిజంగా ఈ పాత్రను చేసేందుకు కాజోల్ సమ్మతిస్తే మాత్రం ఖచ్చితంగా సంచలనమే అవుతుంది.