సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (09:36 IST)

ఆర్జీవీ దర్శకత్వంలో "శశికళ" బయోపిక్

తాను నిర్మించిన చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్". ఈ చిత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా ప్రపంచ వ్యాప్తంగా గత నెల 29వ తేదీన విడుదలై దుమ్మురేపుతోంది. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం నిర్మాణ ఖర్చులన్నీ రాబట్టుకోగా, ఇపుడు లాభాల వర్షం కురిపిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలన ప్రకటన చేశారు. గతంలో శశికళపై సినిమా తీస్తానని ప్రకటించిన వర్మ తాజాగా ఆ సినిమాకు సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. దీనికి సంబంధించి ట్విట్టర్‌లో ఆ పోస్టర్‌ను ట్వీట్ చేశాడు. 
 
తమిళనాట సంచలనం సృష్టించిన జయలలిత మరణం, అటుపై శశికళ ఉదంతాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమా పేరును 'శశికళ' అని వర్మ ప్రకటించాడు. శశికళకు జైలు శిక్ష, మన్నార్‌గుడి మాఫియాలను హైలెట్‌ చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. 
 
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆదివారం ఈ చిత్ర పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిపారు. కాగా, ఆర్జీవీ చాలా కాలం తర్వాత సూపర్ హిట్ కొట్టారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విజయంతో ఇటు ఆర్జీవీతో పాటు అటు ఆయన అభిమానులు ఉర్రూతలూగుతున్నారు.