1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 మే 2016 (15:35 IST)

నేను తల్లిదండ్రుల చాటు బిడ్డని... నాకు దేవుడు అన్ని ఇచ్చాడు : ఐశ్వర్యా రాయ్ బచ్చన్

తాను తల్లిదండ్రుల చాటు బిడ్డను అని బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ అన్నారు. అదేసమయంలో దేవుడు తనకు అన్నీ ఇచ్చాడనీ చెప్పుకొచ్చింది. ఆమె నటించిన తాజా చిత్రం 'సరబ్జీత్' త్వరలో విడుదలకానుంది. 
 
ఈ పరిస్థితుల్లో ఆమె ఓ టీవీ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దేవుడు తనకు అన్నీ ఇచ్చాడని, ఫలితాన్ని ఆశించకుండా పనిచేసుకు పోవడమే తన తత్వం అని చెప్పుకొచ్చింది. పైగా, నేను తల్లిదండ్రుల చాటు బిడ్డని. వ్యక్తిగత జీవితంలో గానీ, వృత్తిపరమైన జీవితంలో గానీ నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక వారి ప్రభావం ఉంటుందని తెలిపింది. 
 
ముఖ్యంగా.. నా నడవడిక కూడా తల్లిదండ్రులు నాకు ఏం చెప్పారో అలాగే సాగుతుంది, ఎక్కడికి వెళ్లినా ఐశ్వర్యలాగానే ఉంటాను. ఏ రంగంలో అడుగుపెట్టినా అలాగే ఉంటాను. నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. అలానే ఉంటాను. ఒక కళాకారిణి కోణంలో చూస్తే, నేనెప్పుడూ విద్యార్థినే, నా వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు లేదు. ఓ పనిని అంగీకరిస్తే, కట్టుబడి ఉండటం, అంకిత భావంతో పనిచేయడం అనేది చాలా ముఖ్యమని ఐశ్వర్యా చెప్పుకొచ్చింది.