శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (17:29 IST)

`రిచి గాడి పెళ్లి` లుక్ ను విడుదల చేసిన ఐశ్వర్య రాజేష్

Richie gaadi pelli
కె ఏస్ఫిల్మ్ వర్క్స్ పతాకంపై నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ నటీనటులు గా కె ఎస్.హేమరాజ్ దర్శకత్వంలో కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ నిర్మిస్తున్న `రిచి గాడి పెళ్లి ` చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ను హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విడుదల చేశారు. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.  
 
ఈ సందర్భంగా దర్శకుడు కె.ఎస్.హేమరాజ్ మాట్లాడుతూ, జీవితం అంటే విభిన్న భావాల సమాహారం. వాటి వ్యక్తీకరణే మన జీవితపు దశాదిశా గమనాన్ని నిర్ణయిస్తుంది. ఈ చిత్రం మన దైనందిన జీవితాలలో భావవ్యక్తీకరణ యొక్క ప్రాముఖ్యతని నొక్కి చెప్తుంది. నటి ఐశ్వర్య రాజేష్ ఈ రోజు టైటిల్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమెకు మా కృతజ్ఞతలు. మోలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎంతో పేరుగాంచిన సినిమాటోగ్రాఫర్ విజయ్ ఉళఘనాథ్, ఎడిటర్ అండ్ టెక్ హెడ్ అరుణ్ ఇఎమ్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాము. ఈ చిత్రం యొక్క మరిన్ని వివరాలను ఒక మధురమైన లవ్ బల్లాడ్ యొక్క లిరికల్ వీడియోతో పాటు ఒక్కొక్కటిగా విడుదల చేస్తాం” అని అన్నారు. 
 
నిర్మాతఃకె ఏస్  ఫిల్మ్ వర్క్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కెఎస్ హేమరాజ్‌, నిమాటోగ్రఫీ - విజయ్ ఉలగానాథ్, సంగీతం - సత్యన్, ఎడిటర్ - అరుణ్ EM, కథ - రాజేంద్ర వైట్ల & నాగరాజు మడూరి, సాహిత్యం - అనంత శ్రీరామ్ & శ్రీ మణి, సంభాషణలు - రాజేంద్ర వైట్ల.