మంగళవారం, 17 జూన్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 మే 2025 (18:27 IST)

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

nagarjuna akkineni
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున హైరాబాద్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. తన డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగియడంతో దాని రెన్యువల్ కోసం వ్యక్తిగతంగా ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. 
 
లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా నాగార్జున అక్కడ అవసరమైన లాంఛనాలను పూర్తి చేశారు. అధికారుల సూచనల మేరకు ఆయన తన ఫోటోను అందించడంతో పాటు సంబంధిత పత్రాలపై సంతకం కూడా చేశారు. 
 
తమ అభిమాన నటుడు నాగార్జున స్వయంగా కార్యాలయానికి రావడంతో అక్కడి సిబ్బంది, అధికారులు ఆయనతో సెల్ఫీలు,  ఫోటోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. నాగార్జున కూడా వారిని నిరాశపరచకుండా వారితో కలిసి సరదాగా ఫోటోలకు పోజులిచ్చారు. సిబ్బందితో కాసేపు ముచ్చటించి అనంతరం తనవాహనంలో అక్కడి నుంచి నిష్క్రమించారు.