1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 మే 2025 (13:52 IST)

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

ravi mohan - kenisha
కోలీవుడ్ హీరో రవి మోహన్ తన సతీమణి ఆర్తి రవితో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో రవి మోహన్ ప్రముఖ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ గత కొంతకాలంగా ప్రచారంలో సాగుతుంది. అయితే, ఈ వార్తలను వారిద్దరూ గతంలో పలుమార్లు కొట్టిపారేశారు. పైగా, తామిద్దరం మంచి స్నేహితులమంటూ ఇద్దరూ చెప్పుకొచ్చారు. 
 
ఈ నేపథ్యంలో వారిద్దరూ ఒక పెళ్లి వేడుకలో జంటగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రముఖ బడా నిర్మాత, వేల్స్ గ్రూపు విద్యా సంస్థల అధినేత డాక్టర్  ఐసరి కె.గణేష్ కుమార్తె పెళ్లి చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలలో రవి మోహన్‌తో పాటుగా సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ కూడా జంటగా హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
గతంలో తమ మధ్య ఎలాంటి లవ్ లేదు.. కేవలం స్నేహం మాత్రమే అని చెప్పిన ఈ జంట ఇప్పుడు జంటగా కనిపించడంతో మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి. సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ వల్లనే రవి మోహన్ తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అవన్నీ పుకార్లు మాత్రమేనని, తాము స్నేహితులమని వారు చెప్పారు. తాము వృత్తిపరంగానే కలిశామని వారిద్దరూ ఇప్పటివరకు చెబుతూ వచ్చారు. 
 
అనవసరంగా తన విడాకుల మధ్య మూడో వ్యక్తిని లాగుతున్నారంటూ జయం రవి అసహనం వ్యక్తం చేశాడు. తన విడాకుల వ్యవహారానికి సింగర్ కెనిషాతో ఎలాంటి సంబంధం లేదని గతంలో రవి మోహన్ తెలిపారు. అయితే, ఈ మాటలన్నీ శుద్ధ అబద్దాలని తాజాగా తేలిపోయింది.