సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 3 నవంబరు 2018 (11:14 IST)

కమల్‌కు తలనొప్పి.. అక్షర ప్రైవేట్ సెల్ఫీ ఫోటోలు లీక్.. మార్ఫింగా..? నిజమైనవా?

కోలీవుడ్‌లో సెలెబ్రిటీల ఫోటోలు లీక్ కావడం మామూలే. గతంలో త్రిష, అమీ జాక్సన్ ప్రైవేట్ ఫోటోలు లీకైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్ ప్రైవేట్ ఫోటోలు లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


తన ప్రైవేట్ రూమ్‌లో అక్షర తీసుకున్న సెల్ఫీలు ఎలా లీకయ్యాయో అర్థం కావట్లేదని కమల్ ఫ్యాన్స్ తలపట్టుకుంటున్నారు. కానీ ఈ ఫోటోలు మార్ఫింగ్ అంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ ఫోటోలపై అక్షర హాసన్ నోరు విప్పలేదు. 
 
శ్రుతిహాసన్, అక్షరహాసన్ కమలహాసన్ కుమార్తెలన్న విషయం తెలిసిందే. శృతిహాసన్ మన తెలుగులోనూ సినిమాలు చేసి విజయం సాధించి, ప్రస్తుతం బ్రేక్ తీసుకుని సింగర్‌గా, సంగీత దర్శకురాలిగా తనను తాను ప్రూవ్ చేసుకునే బిజీలో ఉంది. మరో ప్రక్క  అక్షరహాసన్ కూడా దర్శకురాలిగా తండ్రి వారసత్వం పొందాలని భావిస్తోంది. ఇంకా రాజకీయాల్లో తండ్రికి తోడుగా వుంటోంది.
 
షమితాబ్ అనే హిందీ చిత్రంలో ఏకంగా బిగ్‌బీతోనే అక్షరహాసన్ నటించిన సంగతి తెలిసిందే. అందులో కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ కూడా నటించారు. అయితే మంచి చిత్రం అంటూ విమర్శకుల ప్రశంసలు పొందింది గానీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు. తాజాగా కన్నడంలో ప్రముఖ నటుడు రవిచంద్రన్‌ వారసుడు విక్రమ్‌ చంద్రన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో అక్షర హీరోయిన్‌గా నటించనుందని టాక్ వస్తోంది.