సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2023 (16:25 IST)

లియో కలెక్షన్లన్నీ ఫేక్.. జైలర్ కలెక్షన్లను బ్రేక్ చేయలేదు..

Leo
లియో కలెక్షన్లన్నీ ఫేక్ అంటూ శ్రీధర్ అనే డిస్ట్రిబ్యూటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విజయ్ సినిమా జైలర్ కలెక్షన్స్‌ని అధిగమించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తుంది. సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. 
 
ఇప్పుడు దళపతి విజయ్ లియో సినిమా కలెక్షన్ల గురించి కూడా అదే చర్చ నడుస్తోంది. ఈ సినిమా నిర్మాత లలిత్ కుమార్ కలెక్షన్ల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తున్నారని డిస్ట్రిబ్యూటర్, థియేటర్ యజమాని శ్రీధర్ చెబుతున్నారు.
 
గురు, శుక్ర, శని, ఆది, సోమ, మంగళవారాల్లో లియో సినిమా మంచి వసూళ్లు రాబట్టిందని శ్రీధర్ తెలిపారు. బుధ, గురువారాల్లో కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. చాలా చోట్ల షోలు రద్దయ్యాయి. రెండో రోజు లియో కలెక్షన్లు తగ్గిన మాట వాస్తవమే. నేను కూడా థియేటర్ నడుపుతున్నాను కాబట్టి ఇలా చెప్తున్నాను.

కానీ శని, ఆది, సోమ, మంగళవారాల్లో కలెక్షన్లు బాగున్నాయి. నవంబర్ 1, నవంబర్ 2 ఎలా అని తాము నిర్ణయించలేం. ఇది వారం నుండి వారానికి మారుతూ ఉంటుంది. లియో కలెక్షన్ల గురించి మంగళవారం వరకు చెప్పిన మాట వాస్తవమేనని శ్రీధర్ అన్నారు. ఆ తర్వాత చెప్పేవన్నీ అబద్ధాలు అని శ్రీధర్ చెప్పడం గమనార్హం. 
 
లియో కలెక్షన్‌లను జైలర్‌తో ఎందుకు పోల్చుతున్నారు? తనకు తెలిసినంత వరకు, లియో జైలర్ కలెక్షన్లను బ్రేక్ చేయలేదని ఆయన అన్నారు.