సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 మే 2016 (13:43 IST)

మహిళ యాక్టివ్‌గా ఉంటే వ్యభిచారి లేదా సైకో అనేస్తారు: కంగనా రనౌత్

మహిళ యాక్టివ్‌గా ఉంటే ఆమెను వ్యభిచారిగా భావిస్తారని.. అదే మహిళ ఏదైనా రంగంలో రాణిస్తే సైకో అని ముద్రవేస్తారని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వెల్లడించింది. వ్యభిచారి, సైకో ఈ రెండింటిలో తనను ఏదనుకున్నా పర్లేదని.. ఇతరుల కోసం తాను బతకట్లేదని.. తనకు నచ్చిన విధంగా జీవించేదాన్ని అంటూ కంగనా రనౌత్ తెలిపింది. తనపై వస్తున్న విమర్శలకు సక్సెస్‌తోనే సమాధానమిస్తానని తెలిపింది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ వివాదాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానని, తాను వెళ్ళే దారి సరైందేనని కంగనా రనౌత్ వెల్లడించింది.
 
ఓవైపు హృతిక్ రోషన్‌‍తో గొడవ, మరోవైపు మాజీ బాయ్ ఫ్రెండ్ కామెంట్స్ ఈ అమ్మడిని ఒత్తిడికి గురిచేస్తున్నాయంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జాతీయ అవార్డును కొట్టేసిన కంగనా రనౌత్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో తనకు మంచి స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉన్నారని.. అయితే తన కాళ్లపై తాను నిలబడ్డానని తెలిపింది. తన ఇష్టాయిష్టాలకు విలువ ఇచ్చిన తన తండ్రి అంటే తనకెంతో ఇష్టమని వెల్లడించింది.