అగ్ర హీరోల సినిమాల విడుదలలో సందిగ్ధత- భీటీ కానున్న కొరటాల
కరోనా వల్ల పెద్ద సినిమాలు షూటింగ్‌లు వాయిదా పడి, ఇప్పుడు విడుదలకు దగ్గరయ్యాయి. అయితే ఇంకా ఆంధ్రలో థియేటర్ల ఓపెనింగ్ పూర్తిగా కొలిక్కి రాలేదు. యాభైశాతం సీటింగ్, మూడు షోలు మాత్రమే వేయడంతో పెద్ద నిర్మాతల పెట్టుబడి రాబడికి చాలా సమయం పడుతుందని ఆలోచనలో వున్నారు. కొందరు ఓటీటీలో వచ్చేందుకు సిద్దమయ్యారు. ఇందుకు పలు ఓటీటీలు మంచి ఆఫర్ చేస్తున్నాయి. దానికి టెప్ట్ అయిన `నారప్ప` విడుదల చేశారు. ఇప్పుడు నాని టక్‌జగదీష్ కూడా లైన్‌లో వుంది. దానివల్ల థియేటర్లలో మాకు రాబడి పోయిందని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం తెలంగాణ ఎగ్జిబిటర్లు మూకుమ్మడిగా సినిమా థియేటర్లలో పెద్ద హీరోల సినిమాలు విడుదల చేయాలనీ, ఓటీటీలో వేయాలంటే మూడు నెలలు వాయిదా వేయాలని సూచించారు. దీంతో పెద్ద హీరోలలో కదలిక మొదలైంది. ఇప్పటికే చిరంజీవికి ఈ విషయం వెళ్ళింది. ఆయన సానుకూలంగా స్పందించారు. దాని పర్యావసానమే దర్శకుడు కొరటాల శివ “భీమ్లా నాయక్” నిర్మాతలతో భేటీ కానున్నట్లు సమాచారం. రేపు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపాక సమయం చూసుకుని భేటీ కానున్నారని కొరటాల వర్గీయులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాలల్లోపాటు, కన్నడ, తమిళనాడులలో కూడా పెద్ద హీరోల సినిమాలు విడుదల కావాలంటే కాస్త సమయం పట్టేట్లుంది. ఇంకా కోవిడ్ 3వ వేవ్ రాబోతుందని సూచనలు వస్తున్నాయి. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్. వాయిదా పడింది. ఆచార్య, భీమ్లానాయక్ సినిమాల విడుదల తేదీని ఆదివారంనాటికి ఫైనల్‌గా ఓ కొలిక్కి రావచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్. సినిమా విషయమై మరోసారి అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమా వాయిదా పడితే అక్టోబర్ 13న “ఆచార్య” వస్తాడని అనుకున్నారు. ఏది ఏమైనా కొరటాల భేటీ తర్వాత పూర్తి సమాచారంరానుంది. ఈలోగా ఆంధ్రలో కూడా వై.ఎస్. జగన్ కొన్ని హామీలు ఇవ్వనున్నారు. ప్రధానంగా టిక్కెట్‌రేటు పెంచుకోవడంపై నిర్మాతలు ధైర్యంగా వున్నారు.