బిగ్ బి పై బ్యాడ్ రూమర్... హార్ట్ అటాక్‌తో చనిపోయారని ఫేక్
ఇటీవల బిగ్ బిపై ప్రత్యేకంగా వార్తలు ఏమీ లేవనుకున్నారో ఏమోగానీ, ఆయనపై పెద్ద సంచలనాత్మక వార్తే పుట్టించారు. అదే... బిగ్ బి చనిపోయారని. అంతర్జాలంలో సోషల్ మీడియాలో ఇలా అమితాబ్ బచ్చన్ ఆఖరి శ్వాస విడిచిన ఫోటో అంటూ పెట్టి... హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.... అంటూ పోస్టింగ్ చేశారు. దానిని వేలాది మంది షేరింగ్ చేస్తూ, భారత దేశమంతటా సంచలనం సృష్టించాలని చూశారు.
అమితాబ్‌కు మాసివ్ హార్ట్ అటాక్ వచ్చిందని, ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, తుది శ్వాస విడిచారని క్యాప్షన్ కూడా నెరేషన్ చేశారు. అయితే, ఇది ఫేక్ న్యూస్ అని, ఆయన గతంలో చేసిన ఆసుపత్రి సీన్ ఫోటోను ఇలా, ఆఖరి ఫోటోలా పెట్టారని, అమితాబ్ అభిమానులు, సన్నిహితులు వెంటనే ఖండించారు.
అసలు సోషల్ మీడియాలో ఇలాంటి బ్యాడ్ రూమర్స్ ఎందుకు పుట్టిస్తారో... అని సామాన్యులు తలలు బాదుకుంటున్నారు. ఏది ఏమైనా... భారత దేశం గర్వించదగిన బిగ్ బి... నూరేళ్ళు చల్లగా ఉండాలని... ఈ ఫేక్ పోస్టింగ్, ఆయన దిష్టి తీసేస్తుందని కోరుకుందాం.