ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2016 (11:18 IST)

ఖైదీ నం.150లో 'AMMADU Lets Do KUMMUDU'.. పక్కా మాస్ సాంగ్... మీరూ వినండి (ఆడియో)

మెగాస్టార్ చిరంజీవిన నటించిన 150వ చిత్రం "ఖైదీ నం.150". ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్న విషయం తెల్సిందే. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్

మెగాస్టార్ చిరంజీవిన నటించిన 150వ చిత్రం "ఖైదీ నం.150". ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్న విషయం తెల్సిందే. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చగా హీరో రామ్ చరణ్ నిర్మాత. ఇటీవల విడుదలైన చిత్రం టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆడియో వేడుక జరుగుతుందని అభిమానులంతా భావించారు కానీ.... ఎలాంటి వేడుక లేకుండానే ఆడియోను నేరుగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే జనవరి 4న ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను అంగరంగవైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఆడియోలోని ఓ పాటను రిలీజ్ చేసారు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు... అంటూ సాగే ఈ పాటకు దేవిశ్రీ అందించిన మ్యూజిక్ సూపర్బ్ అంటున్నారు. అభిమానులు. ఆ పాటను మీరూ వినండి మరి. 'అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు' అంటూ సాగే ఈ పాట పక్కా మాస్ ఆడియన్స్‌ని పిచ్చెక్కించడం ఖాయమని తెలుస్తోంది. సినిమాలోని ఇతర సాంగ్స్ కూడా ఇదే రేంజిలో ఉంటాయని భావిస్తున్నారు. ఈ సాంగ్‌కి చిరు తన మార్క్ డాన్స్ వేసినట్టు సమాచారం. కాగా, ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.