శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 17 మే 2018 (17:55 IST)

రంగమ్మత్తకు ఛాన్సులే ఛాన్సులు.. సచ్చిందిరా గొర్రె కోసం వెంకటలక్ష్మి వెయిటింగ్

''రంగస్థలం'' సినిమాలో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ.. ప్రస్తుతం తన కెరీర్‌ను స్మూత్‌గా తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. బుల్లితెర నుంచి వెండితెరకు ట్రాన్స్‌ఫర్ అయిన అనసూయ తనకున్న క్రేజ్‌ను క్యాష్ చ

''రంగస్థలం'' సినిమాలో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ.. ప్రస్తుతం తన కెరీర్‌ను స్మూత్‌గా తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. బుల్లితెర నుంచి వెండితెరకు ట్రాన్స్‌ఫర్ అయిన అనసూయ తనకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటోంది. క్రేజ్ కారణంగా అవకాశాలు వస్తున్నా.. బుల్లితెరను వదిలేయకుండా పక్కాగా ప్లాన్ చేస్తోంది. రంగమ్మత్త రోల్ చేశాక.. అనసూయను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన పాత్రల్ని సృష్టిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆమె మరింత బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ''సచ్చిందిరా గొర్రె'', ''వేరీజ్ వెంకటలక్ష్మి'' సినిమాల్లో ప్రధానమైన పాత్రలను చేస్తోంది. అలాగే వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి చేస్తోన్న మల్టిస్టారర్లోను ఒక కీలకమైన పాత్రను కైవసం చేసుకుంది. ఈ పాత్ర ఆమెకి 'రంగమ్మత్త' స్థాయిలో పేరు సంపాదించి పెడుతుందని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది.
 
ఈ సందర్భంగా తన పుట్టిన రోజును లడక్‌లో తన కుటుంబ సభ్యులతో జరుపుకున్నానని.. బుల్లితెర షోలతో బిజీగా వున్నానని అనసూయ చెప్పింది. ప్రస్తుతం సచ్చిందిరా గొర్రె సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. ఈ సినిమా కామెడీ పంట పండిస్తుందని అనసూయ వెల్లడించింది.