గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 మే 2021 (12:15 IST)

క్రికెటర్ భువనేశ్వర్ శ్యామలకు సోదరుడా..?

shyamala
సోషల్ మీడియాలో తాజాగా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్, యాంకర్ శ్యామల ఇద్దరు అక్కా తమ్ముళ్లు అనే ప్రచారం జోరుగా నడుస్తుంది. ఇద్దరిలో ఒకే పోలికలు ఉంటాయి కాబట్టి వారిద్దరు తోబుట్టువలే అంటూ ఈ వార్తను దావానంలా వ్యాపింపజేశారు. అయితే ఈ విషయం శ్యామల దగ్గరకు వెళ్లడంతో ఆమె దీనిపై స్పందించింది.
 
భువనేశ్వర్, నేను అక్కా తమ్ముళ్లమా, ఈ విషయం నాకే తెలియదు. వాళ్లకేం తెలుస్తుంది అంటూ సెటైర్ వేసింది శ్యామల. దీంతో ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదని అర్ధమైంది. 
 
కాగా, ఇటీవల శ్యామల భర్త చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఓ మహిళ దగ్గర కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని అందుకే ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తన భర్త అలాంటి వాడు కాదని అతనికి అండగా నిలిచింది శ్యామల.