సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 మే 2021 (11:30 IST)

కరోనా నుంచి కోలుకుంటున్న అరుణ్ పాండ్యన్.. అదో పీడకల!

Arun Pandian
ప్రముఖ నటుడు, నిర్మాత అరుణ్ పాండ్యన్ కరోనా నుంచి కోలుకుంటున్నారు. ఈ విషయం అతని కుమార్తె కీర్తి సోషల్ మీడియాలో ధ్రువీకరించింది. ఓ రోజు రాత్రి తన తండ్రికి ఛాతిలో నొప్పి రావడంతో హాస్పిటల్‌కు వెళ్ళామని, అక్కడ కరోనా టెస్ట్ చేయగా, పాజిటివ్ అని తేలిందని కీర్తి చెప్పింది. 
 
ఆ తర్వాత దాదాపు పదిహేను రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండి అరుణ్ పాండ్యన్ చికిత్స తీసుకున్నారని తెలిసింది. అరుణ్ పాండ్యన్ షుగర్ పేషెంట్ కావడంతో ఏమౌతుందో అనే ఆందోళనకు వారు గురయ్యారట. 
 
అయితే... అప్పటికే వాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకోవడం వల్ల కరోనా తీవ్రత అంతగా లేకపోయిందని కీర్తి తెలిపింది. పదిహేను రోజుల తర్వాత కరోనా నెగెటివ్ అని తేలాక మరోసారి గుండె సంబంధిత పరీక్షలు చేసినప్పుడు రెండు వాల్వ్స్ లో 90 శాతం వరకూ బ్లాక్స్ ఉన్నాయనే విషయం బయటపడిందని, కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లోనే మనో ధైర్యంతో తన తండ్రి యాంజోప్లాస్ట్ కు సిద్ధపడ్డారని, ఆపరేషన్ విజయవంతంగా జరిగి ఇప్పుడు కోలుకుంటూ ఉన్నారని కీర్తి చెప్పింది.
 
తన తండ్రి అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే స్పందించి, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు కీర్తి ధన్యవాదాలు తెలిపింది. ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళ ఆరోగ్య విషయమై ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని, ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి అందరూ వాక్సిన్ తీసుకోవాలని, మాస్క్ ధరించాలని కోరింది.