గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (07:44 IST)

తమిళ హాస్య నటుడు వివేక్ కన్నుమూత..

Vivek
తమిళ హాస్య నటుడు వివేక్ (59) మృతి చెందారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చునని.. వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేలా వ్యాఖ్యలు చేసిన వివేక్ శనివారం ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు రాజధాని  చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు.
 
శుక్రవారం ఉదయం 11 గంటలకు వివేక్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబీకులు ధ్రువీకరించారు. 
 
కాగా వివేక్.. దాదాపు 300 కు పైగా సినిమాల్లో నటించాడు. దర్శక శిఖరం కె. బాలచందర్ పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు. "మనదిల్ ఉరుది వేండుం" సినిమా ద్వారా ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు పెద్ద హీరోలందరితో కలిసి నటించారు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ సినిమాల్లో నటించి.. సినిమా ప్రియులను నవ్వించాడు వివేక్.