ఢిల్లీని వణికిస్తానన్న జగన్... సీబీఐ పేరెత్తితే గజగజ వణికిపోతున్నారు...

lokesh
ఠాగూర్| Last Updated: మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (14:26 IST)
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల చుట్టూ ఇపుడు ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారనీ, ఆ కేసు సంగతి ఏమైదంటూ పవన్ సూటిగా ప్రశ్నించడంతో ఇపుడు ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది.

ఈ నేపథ్యంలో తన తండ్రి హత్య కేసులో విచారణకు ఏపీలోని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం సహకరించడంలేదని వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆరోపించడం తెలిసిందే. తాజాగా డాక్టర్ సునీతారెడ్డి కామెంట్స్ వీడియోను టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందరూ అడిగినట్టే తాను కూడా అడుగుతున్నానని, హూ కిల్డ్ బాబాయ్? అంటూ ట్వీట్ చేశారు.

"మీ చిన్నాన్నను మా నాన్న నరికేశాడన్నావు. దానిపై సీబీఐ దర్యాప్తు చేయాలన్నావు. ఇప్పుడెందుకు సీబీఐని వద్దంటున్నావు... చెప్పు అబ్బాయి!" అంటూ సీఎం జగన్ ను నిలదీశారు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సీబీఐ వస్తే చాలు... ఢిల్లీని గడగడలాడిస్తానన్న జగన్ గజగజా వణుకుతున్నాడు అని ఎద్దేవా చేశారు.

దీనిపై మరింత చదవండి :