సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (20:07 IST)

నా భర్త గురించి నాకు తెలుసు, మరో మహిళ గురించి తెలియదు, తేల్చుకుంటా: యాంకర్ శ్యామల

తన నరసింహా రెడ్డి ఎలాంటివారో తనకు తెలుసుననీ, తన భర్తపై తప్పుడు కేసు పెట్టారని అంటోంది యాంకర్ శ్యామల. ఆమె భర్త ఈరోజు చీటింగ్ కేసు కింద అరెస్టయిన సంగతి తెలిసిందే. యాంకర్ శ్యామల భర్తతో పాటు అతడికి సాయం చేసిన మహిళను కూడా పోలీసులు అరెస్టు చేసారు.
 
ఈ అరెస్టుపై యాంకర్ శ్యామల స్పందిస్తూ... తన భర్త ఎవరినీ చీట్ చేయలేదని అన్నారు. త్వరలో నిజానిజాలు బయటకు వస్తాయని, అసలు తన భర్తపై కేసు పెట్టిన మహిళ ఎవరో కూడా తనకు తెలియదనీ, అన్ని విషయాలు తన భర్తతో మాట్లాడి తెలుసుకుంటానంటూ చెప్పుకొచ్చారు.
 
అలాగే ఈ కేసులో తన భర్తతో పాటు అరెస్టయిన మరో మహిళ గురించి తనకేం తెలియదన్నారు. అసలు తన భర్తపై పెట్టిన కేసు తప్పుడు కేసు అంటూ శ్యామల వాదిస్తోంది. మరి ఈ కేసు వాస్తవాలు ఏమిటో పోలీసుల విచారణలో తేలనుంది.