మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (08:47 IST)

శాండల్‌వుడ్‌లో విషాదం.. హీరోయిన్ మాలాశ్రీ భర్త మృతి

తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనా వైరస్ సోకి హీరోయిన్ మాలాశ్రీ భర్త కన్నుమూశారు. ఆయన వయసు 52 యేళ్లు. పేరు రాము. 
 
నిజానికి కరోనా వైరస్ మహమ్మారి సినీ పరిశ్రమను ఆర్థికంగా దెబ్బతీయడమేకాకుండా పలువురు సినీ ప్రముఖులను కూడా ఈ మహమ్మారి బలి తీసుకుంటుంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటిలు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలను కోల్పోగా.. తాజాగా సీనియర్ హీరోయిన్ మాలా శ్రీ భర్త కుణిగల్ రాము (52) కరోనాతో మరణించారు. 
 
గత మూడు రోజులుగా కరోనాతో పోరడుతున్న ఆయన సోమవారం సాయంత్రం కన్నుముశారు. కన్నడ పరిశ్రమలో కోటిరాముగా పేరుతెచ్చుకున్న "రాము ఏకే 47", "లాకప్ డెత్", "కలాసిపాళ్యా" వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించాడు. 
 
ఇదిలా ఉంటే.. గతవారం ఆయన కాస్త అనారోగ్యంగా ఉండడంతో.. కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అందులో పాజిటివ్ అని తేలీంది. అయితే శుక్రవారం నుంచి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో బెంగుళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేరారు. కాగా సోమవారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
 
మరోవైపు, మాలాశ్రీ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు పొందింది. కేవలం తెలుగులోనే కాకుండా. కన్నడ, తమిళ భాషలలో కూడా టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.