సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (16:31 IST)

సింగర్ చేతులను తన నడుముపై వేయించుకున్న యాంకర్ శ్రీముఖి, ఎందుకు?

హాట్ యాంకర్ శ్రీముఖి బాగా రెచ్చిపోతోంది. అనర్గళంగా మాట్లాడుతూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో శ్రీముఖి సక్సెస్ అయ్యిందనే చెప్పవచ్చు. అయితే అంగాంగ ప్రదర్సనకు, లేకుంటే అసభ్యంగా నర్తించడానికో.. లేకుంటే నటించడానికో శ్రీముఖి ఎప్పుడూ ఒప్పుకోదు. అదుర్స్, మనీ మనీ, సూపర్ మామ్, సూపర్ సింగర్, జూలకటక, కామెడీ నైట్స్, బొమ్మ అదిరింది, పటాస్ వంటి షోలలో యాంకర్‌గా శ్రీముఖి బాగానే పేరు తెచ్చుకుంది.

 
ఇక సినిమాలైతే జులాయి, శైలజ, జెంటిల్ మేన్, ఇష్క్ కాదల్, బాబు బాగా బిజీలలో నటించింది. అలాంటి శ్రీముఖి తాజాగా ఒక కుర్రాడితో రొమాంటిక్‌గా హొయలు పోయింది. పాట పాడేందుకు వచ్చిన ఒక సింగర్ చేతులను తన నడుముపై వేయించుకుని ఆమె డ్యాన్స్ చేసింది. 

 
అది కూడా జడ్జిల పర్మిషన్ తీసుకుని మరీ చేసింది. దీంతో అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు. ఎవరితోను దగ్గరగా మెలగని ఆ హాట్ యాంకర్ అతనికి ఎలా కనెక్టయ్యిందని అందరూ అనుకుంటున్నారు. అయితే షోలో భాగంగానే అలా చేశానంటోంది శ్రీముఖి.