గుంటూరు అమ్మాయిని పెళ్లాడిన సింగర్ రేవంత్
తెలుగు సినీ గాయకుడు, ఇండియన్ ఐడియల్ - 9 విజేత రేవంత్ ఓ ఇంటివాడయ్యాడు. గుంటూరు అమ్మాయిని మనువాడారు. వీరి వివాహం చాలాచాలా సింపుల్‌గా జరిగింది. వధువు పేరు అన్విత. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లికి సంబంధించిన పెళ్లి ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో కోవిడ్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. దీంతో ఈ పెళ్లి వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, అతికొద్దిమంది గాయనీ గాయకులు మాత్రమే హాజరయ్యారు.
కాగా, రేవంత్, అన్వితల నిశ్చితార్థం గత యేడాది డిసెంబరు నెల 24వ తేదీన జరిగింది. ఈ విషయాన్ని రేవంత్ తన ఇన్‌స్టా ఖాతాలో వెల్లడించారు. ఇపుడు గుంటూరులోని ఓ ఫంక్షన్ హాలులో ఈ వివాహం జరిగింది.