శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 23 మే 2017 (15:20 IST)

'అనుష్క తొడ' నుంచి 'అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు' వరకూ... యాంకర్లే కారణమా?

ఆడియో వేడుకలు అనగానే కొంతమంది నటులు పారిపోవాల్సిన పరిస్థితో... లేదంటే నోటికి తాళాలు వేసుకుని కూర్చుంటేనే మంచిది. ఎందుకంటే వేడుకను నడిపించే యాంకర్లు జనంలో ఉత్సాహం నింపేందుకు... తొడ, అమ్మాయిలు హానికరమా... వంటి వివాదాస్పద అంశాలను పట్టుకుని వాటిని అక్కడి

ఆడియో వేడుకలు అనగానే కొంతమంది నటులు పారిపోవాల్సిన పరిస్థితో... లేదంటే నోటికి తాళాలు వేసుకుని కూర్చుంటేనే మంచిది. ఎందుకంటే వేడుకను నడిపించే యాంకర్లు జనంలో ఉత్సాహం నింపేందుకు... తొడ, అమ్మాయిలు హానికరమా... వంటి వివాదాస్పద అంశాలను పట్టుకుని వాటిని అక్కడికి వచ్చిన నటీనటులపైకి వదలడంతో కొందరు వాటిపై తేడాగా స్పందించేస్తున్నారు. 
 
ఆమధ్య అనుష్క 'సైజ్ జీరో' చిత్రం ఆడియో వేడుకలో కూడా ఇదే జరిగింది. నటుడు అలీ స్టేజిపైకి వచ్చేసరికి సీనియర్ యాంకర్ సుమ... తొడ కొట్టడం గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. సోనాల్ చౌహాన్‌ను తొడ కొట్టాలంటూ అడిగింది. అప్పుడే అలీ కూడా స్టేజిపైకి రావడంతో... అనుష్క తొడపైకి మళ్లాయి ఆయన కామెంట్లు. అది కాస్తా రచ్చరచ్చ అయింది. చివరికి మహిళా సంఘాలు డిమాండ్ చేయడంతో క్షమాపణలతో ముగిసింది. 
 
ఐతే తను అనుష్క తొడ గురించి మాట్లాడటానికి కారణం యాంకర్ సుమ అంటూ అలీ తర్వాత వెల్లడించాడు. యాంకర్ సుమ అలా తొడ గురించి కాకుండా వేరే మాట్లాడి వున్నట్లయితే అసలా టాపిక్కే వచ్చేది కాదని చెప్పుకొచ్చాడు. ఇది నిజమే కావచ్చని చాలామంది అప్పట్లో అనుకున్నారు కూడా. 
 
ఇక ఇప్పుడు నాగచైతన్య నటించిన చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో యాంకర్ గీత ఓ ప్రశ్నపై సమాధానాన్ని రాబట్టేందుకు నటీనటుల వద్దకు వెళ్లడం మొదలుపెట్టింది. ఆ ప్రశ్న... అమ్మాయిలు హానికరమా...? అనేది. అసలు ఈ ప్రశ్నే తప్పని చలపతిరావు అంటున్నారు. యాంకర్ ఏదో గబాగబా వచ్చేసి తనను అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియని సందిగ్దంలో ఇలా నోటికొచ్చింది చెప్పేశానంటూ సర్దుకుంటున్నారు. 
 
అసలు యాంకర్... 'అమ్మాయిలు హానికరమా' అనే ప్రశ్నను తనను అడగకపోయి వుంటే ఈ సమస్య వచ్చేది కాదని ఆయన అంటున్నారు. అప్పుడు అలీ ఇప్పుడు చలపతిరావులు చెప్పేది ఏమిటంటే... యాంకర్లే తమ వ్యాఖ్యలకు కారణమయ్యారని. మరి దీనిపైన కూడా నిర్వాహకులు దృష్టి పెడితే బావుంటుందేమో...? 
 
దర్శకరత్న దాసరి ఎప్పుడో చెప్పారు. ఆడియో వేడుకలు రికార్డింగ్ డ్యాన్సుల్లా మారిపోయాయని. అలా కాకుండా ఆడియో వేడుకలో సంగీత దర్శకుడు, గీత రచయితల గురించి చెప్పుకుంటూ వివాదాస్పద మాటల జోలికి వెళ్లకుండా వుంటే అంతా సవ్యంగా సాగుతుందనేది చాలామంది అభిప్రాయం. ఏమంటారు?