శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 5 మే 2024 (15:45 IST)

కుప్పుస్వామి అన్నామలై బయోపిక్.. విశాల్‌తో చర్చలు

vishal
మాజీ ఐపీఎస్ అధికారి కుప్పుస్వామి అన్నామలై ప్రస్తుతం దక్షిణ భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తొలిసారిగా పార్లమెంట్‌కు పోటీ చేసిన ఆయన ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
 
తమిళనాడు, కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి అన్నామలై పార్లమెంట్‌కు పోటీ చేయగా, బయోపిక్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన సమయంలో, అన్నామలైను అక్కడ 'సింహం' అని ముద్దుగా పిలుచుకుంటారు. 
 
అన్నామలై 2020లో తమిళనాడు బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీలో అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడయ్యారు.
 
తమిళనాట రాజకీయాల్లో అన్నామలై దూసుకుపోతుండడంతో ఓ ఆసక్తికరమైన బయోపిక్‌తో రాజకీయ నాయకుడి క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయమని కొందరు దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

కోలీవుడ్‌లోని ఊహాగానాల ప్రకారం, విశాల్ ఈ ప్రాజెక్ట్‌ను హెడ్‌లైన్ చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.