గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 28 మార్చి 2024 (13:16 IST)

అనుపమ పరమేశ్వరన్ హర్ట్ అవడంతో టిల్లు స్కేర్ నిడివి తగ్గించారా !

Anupama Parameswaran, - siddu
Anupama Parameswaran, - siddu
కార్తికేయ 2 లో చక్కగా నటించిన అనుపమ పరమేశ్వర్ తాజాగా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా టిల్లు స్కేర్ లో హైటెక్ అమ్మాయిగా నటించింది. పబ్ లకు వెల్ళడం, కిస్ లు ఇవ్వడం, రొమాన్స్ చేయడం వంటి సన్నివేశాలతో ట్రైలర్, పబ్లిసిటీ నిండిపోయింది. దీనితో సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. అనుపమ ఇలాంటి పాత్రలు చేస్తుందా? ఆమె సెక్సీ అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ అవుతున్నాయి. దానిపై షూటింగ్ లో పెద్దగా తప్పు అనిపించలేదనీ, పబ్లిసిటీ విషయంలో తనను టార్గెట్ చేశారని వాపోయింది. దానితో ప్రమోషన్ కు దూరంగా వుందనే టాక్ నెలకొంది.
 
దీనిపై సిద్ధు జొన్నలగడ్డ స్పందిస్తూ.. క్రియేటివ్ ఫీల్డులో వున్న వారు సెన్సిటివ్ గా వుంటారు. ఉమెన్ పరంగా మరింత ఎక్కువగా వుంటుంది. ఫిలింఫీల్డులో వున్న వారిపై ఇలాంటి కామెంట్లు రావడం సహజం. కానీ ట్రైలర్ లోని ఓ పాయింట్ ను హైలైట్ చేసి రకరకాలుగా రాయడం, సెటైర్లు వేయడం కరెక్ట్ కాదు. బహుశా వాటివల్ల తను రియాక్ట్ అయివుంటుందని క్లారిటీ ఇచ్చారు. కానీ, సినిమా నిడివి తగ్గడానికి దానికి సంభందం లేదు అని సిద్దు చెప్పారు.