సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (12:31 IST)

తమిళ అర్జున్ రెడ్డితో అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్

Anupama
త‌మిళ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ కొన్నేళ్ల క్రితం తన కథానాయకుడిగా అరంగేట్రం చేశాడు. ఈ యువ నటుడికి ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. తాజాగా మారి సెల్వరాజ్‌తో ధృవ్ విక్రమ్ సినిమా చేయనున్నాడు.
 
ఇందులో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ ఎంపికైంది. ఈ ప్రాజెక్ట్‌ను పా రంజిత్ నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. 
 
ఇక అనుపమ పరమేశ్వరన్ "టిల్లు స్క్వేర్" వంటి చిత్రాలతో నటించడం ద్వారా గ్లామ్ ఐకాన్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తుందని టాక్ వస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది. స్పోర్ట్స్ డ్రామాలో మొదటిసారి అనుపమ నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.