మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (17:59 IST)

వామ్మో.. అనుష్క ఇలా మారిపోయిందే.. ఫోటోలు వైరల్..

సైజ్ జీరో కోసం స్వీటీగా కనిపించేందుకు భారీగా ఒళ్లును పెంచేసిన అనుష్క.. ఆపై ఒళ్లు తగ్గించేందుకు నానా తంటాలు పడింది. బాహుబలి సినిమా షూటింగ్‌లో ఒళ్లు తగ్గలేక జక్కన్నకు గ్రాఫిక్స్ కోసం కొన్ని కోట్లు ఖర్చుపెట్టింది. అయితే బాహుబలి తర్వాత బరువు తగ్గేందుకు అనుష్క వర్కౌట్లు భారీగానే చేసింది. ఈ వర్కౌట్లు ఫలించాయి. అవును అనుష్క బరువు తగ్గింది. 
 
ఇందుకోసం విదేశాలకు వెళ్లి బరువు తగ్గింది. ప్రస్తుతం అనుష్క ముందులా సన్నగా, నాజూగ్గా కనిపిస్తోంది. అంతేగాకుండా బరువు తగ్గడంతో అనుష్క అందం మరింత పెరిగింది. ఆమె ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దేవసేన ఒళ్లు తగ్గిన ఫోటోలను ఆమె ఫ్యాన్స్ భారీగా షేర్ చేస్తున్నారు. ఫలితంగా లైఫ్ స్టైల్ కోచ్ లుక్‌తో దిగిన అనుష్క ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.