శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (19:49 IST)

కాంప్రమైజ్ కాకుండా ఇక్కడ ఉండలేం... అరియానా గ్లోరీ

చిత్రపరిశ్రమలో నిలదొక్కుకోవాలన్నా, పదికాలాల పాటు కెరీర్‌ను కొనసాగించాలన్నా కాంప్రమైజ్ కాక తప్పదనని బిగ్ బాస్ ఫేం అరియానా గ్లోరీ అంటోంది. పైగా, ఈ ఫీల్డ్‌లో విజయం సాధించాలంటే కోపగించుకోరాదన్నారు. ఈ ఫీల్డ్‌లో కోపం వల్ల సాధించేదేమీ లేదు. కాంప్రమైజ్‌ కావాల్సిందే, తప్పదు అంటూ అరియానా చెప్పుకొచ్చింది. 
 
ఇటీవల వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మతో కలిసి జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ దిగిన ఫోటోలను షేర్ చేయడంతో ఆమె ఒక్కసారిగా మీడియా దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా, అరియానాకు ఎలా వ్యాయామాలు చేయాలో వర్మ పక్కనుండి మరీ నేర్పించారు.
 
దీనిపై ఆమె మాట్లాడుతూ, నేను ఫిట్‌నెస్‌ గర్ల్‌ కాను. జిమ్‌కు పోవడం ఇష్టం ఉండదు. పైగా నేను ఫుడ్‌ లవర్‌ను. అరగంటకోసారి తినటం అలవాటు ఉందన్నారు. 
 
అలాగే, వర్మతో తాను కలిసినపుడు మేం సాధారణంగానే మాట్లాడుకున్నాం. ఆయన ఓపెన్‌గా మాట్లాడారు. ఈ జిమ్‌ ఇంటర్వ్యూ నాకు ప్లస్‌ అవుతుందేమో కానీ వర్మగారికి మామూలు విషయమే!. ఈ ఇంటర్‌వ్యూకి మంచి స్పందన వస్తోంది. అది బోల్డ్‌ అంటే ఏమీ చేయలేను అని వ్యాఖ్యానించింది.