బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (13:05 IST)

తొలి భార్యను చీట్ చేయలేక జయలలితను పెళ్లి చేసుకోలేని టాలీవుడ్ హీరో... ఎవరు?

ఒక నాటి సినీ నటి, తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలితను పెళ్లి చేసుకోవాలని అందాల నటుడు శోభన్ బాబు పెళ్లి చేసుకోవాలని భావించాడనీ, కానీ అది వాస్తవరూపం దాల్చలేదని ప్రముఖ రచయిత ఆరుద్ర భార్య కె.రామలక్ష్మి

ఒక నాటి సినీ నటి, తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలితను పెళ్లి చేసుకోవాలని అందాల నటుడు శోభన్ బాబు పెళ్లి చేసుకోవాలని భావించాడనీ, కానీ అది వాస్తవరూపం దాల్చలేదని ప్రముఖ రచయిత ఆరుద్ర భార్య కె.రామలక్ష్మి అన్నారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, శోభన్ బాబు వెరీ ఫైన్ మ్యాన్. జయలలిత వెరీ వెరీ ఫైన్ టాలెంటెడ్ గార్ల్. ‘గోరింటాకు’ సినిమాను జయలలిత ఇంట్లో చిత్రీకరించారు. ‘మీరందరూ ఇక్కడ భోజనం చేయండి’ అని ఆ రోజున శోభన్ బాబుతో జయలలిత అంది. ‘ఎందుకు, ఫుల్ డే షూటింగ్ లేదు’ అని ఆయన సమాధానం చెప్పాడు. ‘లేదు. నేను వడ్డిస్తా’ అంది..జయలలిత నిజమైన ప్రేమ కనబరుస్తుంది. 
 
జయలలితను శోభన్ బాబు పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కానీ, సాధ్యపడలేదు. ఎందుకంటే, ఆయన తన భార్యను మోసం చేయలేక. శోభన్ బాబు చాలా సిన్సియర్. శోభన్ బాబు కొడుకు కూడా బాగానే ఉంటాడు. ఎందుకో! సినిమాల్లోకి రావద్దని చెప్పాడు!’ అని రామలక్ష్మి చెప్పుకొచ్చారు. అలాగే, శోభన్ బాబు చాలా మంచి వ్యక్తి అని చెప్పారు.