1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: సోమవారం, 28 నవంబరు 2016 (19:02 IST)

అవసరాల శ్రీనివాస్ 'సోగ్గాడు' మూవీ ప్రి-లుక్ ఇదే

నటుడిగా, దర్శకుడిగా, రచయితగా.. ఇలా చేపట్టిన ప్రతి పనిలో తనదైన మార్క్ సృష్టించుకున్న అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న ‘సోగ్గాడు’ అనే సినిమా ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ‘హంటర్‌’కి రీమే

నటుడిగా, దర్శకుడిగా, రచయితగా.. ఇలా చేపట్టిన ప్రతి పనిలో తనదైన మార్క్ సృష్టించుకున్న అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న ‘సోగ్గాడు’ అనే సినిమా ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన 
 
‘హంటర్‌’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను త్వరలోనే విడుదల చేస్తారట. ఈ ఫస్ట్‌లుక్ కంటే ముందే ప్రీ-లుక్ అంటూ ఒకటి విడుదల చేశారు.
 
హాట్ హాట్ ఉన్న ఈ ప్రీ-లుక్ పోస్టర్‌లో సినిమాలో ఎవరెవరు నటించారన్నది తెలియజేశారు. అవసరాల శ్రీనివాస్ సరసన మిస్తీ చక్రవర్తి, తేజస్వి, సుప్రియ, శ్రీముఖి తదితరులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ కంటే ఎమోషన్ తనకు బాగా నచ్చిందని, అందుకే సినిమా చేశానని అవసరాల శ్రీనివాస్ మొదట్నుంచీ చెబుతూ వస్తున్నారు. నవీన్ మేడారం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.