మహేష్ బాబుది గోల్డెన్ హ్యాండ్!
హీరో మహేష్‌బాబుది గోల్డెన్ హాండ్ అంటూ నిర్మాత బి.ఎ.రాజు కితాబిచ్చారు. ఆయన నిర్మించిన చిత్రం 'వైశాఖం'. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ గ్రాండ్‌గా ప్రసాద్‌ల్యాబ్‌లో చేశారు. మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేయడంతో గ్రాండ్‌గా మారింది. దీనిపై నిర్మాత మాట్లాడుతూ..
హీరో మహేష్‌బాబుది గోల్డెన్ హాండ్ అంటూ నిర్మాత బి.ఎ.రాజు కితాబిచ్చారు. ఆయన నిర్మించిన చిత్రం 'వైశాఖం'. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ గ్రాండ్‌గా ప్రసాద్‌ల్యాబ్‌లో చేశారు. మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేయడంతో గ్రాండ్‌గా మారింది. దీనిపై నిర్మాత మాట్లాడుతూ.. ఎంతో బిజీగా ఉండి కూడా మా మీద అభిమానంతో ఈ ఫంక్షన్‌కి వచ్చినందుకు సిన్సియర్‌గా ఆయనకు నా స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను. ఆయన హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్. ఆయన హ్యాండ్‌తో ఆరు సినిమాలు ఆడియో రిలీజ్ చేశాం. ఆరూ హిట్ అయ్యాయి. ఇది ఏడవ సినిమా. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుంది. కేవలం ఒక్క ఫోన్ చేయగానే త్రివిక్రమ్‌గారు, వంశీ పైడిపల్లిగారు వచ్చినందుకు వారికి నా థాంక్స్'' అన్నారు.
మహేష్ బాబు మాట్లాడుతూ - ''ఇండస్ట్రీలో నాకు బాగా కావాల్సిన వ్యక్తుల్లో బి.ఎ. రాజు ఒకరు. ఆయనకి ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. 'వైశాఖం' పాటలు, విజువల్స్ చాలా బాగున్నాయి. దర్శకులు జయ గారికి, హరీష్, అవంతిక, టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.