సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Mohan
Last Modified: గురువారం, 3 ఆగస్టు 2017 (21:28 IST)

"బాహుబలి" పెళ్లిచూపులు ఆస్ట్రేలియాలో జరుగుతాయా?

"బాహుబలి" సినిమా తెలుగు సినిమాను జాతీయ స్థాయికే కాకుండా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారతీయ చలనచిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది.

ఇక ఈ చిత్రంలో బాహుబలికి పెళ్లయింది కదా.. మరి ఎందుకు ఈ "పెళ్లిచూపులు" అని అనుకుంటున్నారా? అదేం కాదులెండీ.. ఈ చిత్రంతో పాటుగా గత సంవత్సరం రిలీజై మంచి హిట్టయిన "పెళ్లిచూపులు" అనే చిన్న చిత్రం కూడా ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరగనున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ప్రదర్శితం కానున్నాయి. 
 
ప్రతిస్టాత్మకంగా జరిగే ఈ ఫిలిం ఫెస్టివల్‌లో పలు భారతీయ భాషా చలనచిత్రాలను ప్రదర్శిస్తారు. ఇందులో తెలుగు నుంచి బాహుబలి, పెళ్లిచూపులు చిత్రాలు మాత్రమే ఎంపికయ్యాయి.