గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 మే 2017 (09:54 IST)

హృతిక్ రోషన్‌-నయనతార- సోనమ్ కపూర్ జక్కన్నకు నో చెప్పారట.. ఇప్పుడు ఏడ్చుకుంటున్నారట!

బాహుబలి-2లో శివగామిని ఛాన్సును శ్రీదేవి చేజార్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హృతిక్ రోషన్ కూడా బాహుబలి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడని టాక్ వస్తోంది. బాహుబలిలో అమరేంద్ర బాహుబలిగా నటించే అవకాశం తొలుత బా

బాహుబలి-2లో శివగామిని ఛాన్సును శ్రీదేవి చేజార్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హృతిక్ రోషన్ కూడా బాహుబలి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడని టాక్ వస్తోంది. బాహుబలిలో అమరేంద్ర బాహుబలిగా నటించే అవకాశం తొలుత బాలీవుడ్‌ నటుడు రుతిక్‌రోషన్‌నే వరించిందట. దర్శకుడు రాజమౌళి ఆయన్నే సంప్రదించారట.  కానీ ఆయనకు కాల్ షీట్స్ సమస్య తలెత్తడంతో బాహుబలిలో నటించనని చెప్పేశాడట. 
 
హృతిక్ రోషన్ నో చెప్పడంతో నటుడు ప్రభాస్‌ను ఆ అవకాశం వరించింది. దీంతో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇక భల్లాళదేవ పాత్రకు తొలుత మరో బాలీవుడ్‌ నటుడు జాన్‌అబ్రహాంను నటింపజేసే ప్రయత్నాలు కూడా ఇలాగే చేజారిపోయాయట. 
 
కథానాయకి దేవసేన పాత్రకు ముందుగా నటి నయనతారను అనుకున్నారట. ఆమె కూడా కాల్ షీట్స్ సమస్యతో నో చెప్పిందట. ఇక అవంతిక పాత్రకు ముందుగా తమన్నా లిస్ట్‌లో లేరట. ఆ పాత్రకు బాలీవుడ్‌ బ్యూటీ సోనంకపూర్‌ను ఎంపిక చేయాలని ప్రయత్నించినా, ఆమె నిరాకరించడంతో తమన్నా పంట పండిందట. 
 
ఇలా అనుకున్న తారలంతా నో చెప్పడంతో విసిగిపోయిన రాజమౌళి ప్రాంతీయ తారలను ఎంచుకుని.. బంపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేగాకుండా... కలెక్షన్లు, రికార్డుల పరంగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి జక్కన్న చుక్కలు చూపించాడు. ఇప్పటికైనా బాలీవుడ్ తారలు బుద్ధి తెచ్చుకున్నారో లేదో మరి..