శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జులై 2023 (13:16 IST)

"బేబీ" కలెక్షన్ల వర్షం.. కేవలం 8 రోజుల్లో 54 కోట్లు.. వైష్ణవి అదుర్స్

Baby CInema
Baby CInema
"బేబీ" సినిమా ప్రస్తుతం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆనంద్ దేవరకొండ .. వైష్ణవి చైతన్య .. విరాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమాకు సక్సెస్ టాక్ వచ్చింది. ఇక రెండో వారంలో ఈ సినిమా కలెక్షన్లను కుమ్మేస్తోంది. 
 
కేవలం 8 రోజుల్లో 54 కోట్ల రూపాయలను వసూళ్లు సాధించిన చిత్రంగా బేబీ అదరగొట్టింది. ఒక మీడియం రేంజ్ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషంగా సినీ పండితులు చెప్తున్నారు. 
 
ఇకపోతే.. యూట్యూబ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న వైష్ణవి.. బేబీ సినిమాలో నటనతో ఆకట్టుకుంది. దీంతో యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యిందని చెప్పవచ్చు. ఇక ఆనంద్ దేవరకొండ కూడా తన పాత్రలో వేరియేషన్ చూపించాడు. 
 
ఈ సినిమా కోసం వీరిద్దరితో పాటు ఈ చిత్రంలో మరో కీలక నటుడు విరాజ్ అశ్విన్ కూడా మంచి నటనతో బాగానే పారితోషికం తీసుకున్నాడని టాక్ వస్తోంది.